: అసోంలో భూకంపం 06-11-2013 Wed 10:58 | అసోంలో ఈ ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపానికి డోర్లు, కిటికీ తలుపులు కదిలిపోయినట్లు సమాచారం. భూకంప కేంద్రం కర్బి వద్ద భూగర్భంలో 20 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.