: తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వండి: టీ కాంగ్రెస్ నేతలు


విభజన నేపథ్యంలో తెలంగాణకే ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు కోరారు. జీవోఎంకు పంపిన నివేదికలో ఈ మేరకు తమ డిమాండును పేర్కొన్నారు. దీనికితోడు.. ప్రాణహిత-చేవెళ్ల, పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించాలని కోరారు. జిల్లాలోని ముఖ్య కేంద్రాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటుచేయాలన్నారు. వైద్య, ఉద్యాన, పశుసంవర్ధక, మహిళా విశ్వ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని... శంకర్ పల్లి, నేదునూరు విద్యుత్ కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో శాంతి భద్రతల కోసం ప్రత్యేక కమిటీ వేయాలని సూచించారు. ఉమ్మడి రాజధానిలో సీమాంధ్ర పరిపాలనకు ప్రత్యేక ప్రాంతాన్ని కేటాయించాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు కోరారు.

  • Loading...

More Telugu News