: రెండు వికెట్లు కోల్పోయిన విండీస్


భారత్, వెస్టిండీస్ మధ్య కోల్ కతాలో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ లో విండీస్ కు ఆదిలోనే కోలుకోని దెబ్బ తగిలింది. ఓపెనర్లు గేల్, పావెల్ ఇద్దరూ పెవిలియన్ చేరారు. బౌలర్లపై విరుచుకుపడే గేల్ కేవలం 18 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. 32 బంతుల్లో 4 ఫోర్లతో 18 పరుగులు చేసిన గేల్... భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో మురళీ విజయ్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కీరన్ పావెల్ 40 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ తో 28 పరుగులు చేసి... షమీ బౌలింగ్ లో భువనేశ్వర్ కుమార్ కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తొలి టెస్టు ఆడుతున్న మొహమ్మద్ షమీకి టెస్టుల్లో ఇదే తొలి వికెట్. ప్రస్తుతం విండీస్ 17 ఓవర్లలో ఒక్క వికెట్ నష్టానికి 61 పరుగులతో ఆడుతోంది. శామ్యూల్స్, డారెన్ బ్రావో క్రీజులో ఉన్నారు.

  • Loading...

More Telugu News