: మగువలే ప్రజ్ఞావంతులు
ఒకేసారి రెండు మూడు పనులను నిర్వహించడంలో చక్కగా సమర్ధవంతంగా పనిచేయడంలో పురుషులకన్నా మహిళలే ముందుంటారని నిపుణులు చెబుతున్నారు. ఒకే సమయంలో ఏదో ఒక పనికే కాకుండా బహుముఖ పాత్రలను పోషించడంలో కూడా మగువలే ముందుంటారని నిపుణుల అభిప్రాయం. పురుషులతో పోల్చుకుంటే ఏ విషయాన్నైనా మహిళలు ముందుచూపుతో ఆలోచిస్తారు. ఒక ప్రణాళిక ప్రకారం తమ పనులను చకచకా చేయడంతో అందులో పరిణతి సాధిస్తారు.
ఏదైనా ఒక పనిచేయడంలో ప్రణాళికతో ముందుకు వెళ్లడంలో పురుషులకన్నా మహిళలే ముందుంటారని నిపుణులు చెబుతున్నారు. ఒకవైపు ఇంటిపనులు, వంట పనులు, పిల్లల బాధ్యత, ఆఫీసు పనులు ఇలా పలు అంశాలను చక్కదిద్దుకుంటూ తమ అర్హతలను పెంచుకునే దిశగా కూడా మహిళలు ఆలోచిస్తారు. వ్యక్తిగతంగాను, వృత్తిపరంగాను ఎదురయ్యే సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటారు. మగువలు ఇంత సమర్ధవంతంగా పనిచేయడానికి కారణం ఓపికగా, బాధ్యతగా వ్యవహరించడం, అంకిత భావంతో పనిచేయడం. ఈ కారణాలవల్ల ఎన్ని పనులనైనా సమర్ధవంతంగా చేసే శక్తిసామర్ధ్యాలతో వారు ముందుకు వెళ్లడానికి కారణమవుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.