: ఇందులో పడితే ఇక అంతే... మాయం!
ఈ కాలంలో మాయలు, మంత్రాలు ఎక్కడున్నాయి... అనుకుంటున్నారా... అయితే ఇది మంత్రాలు చేసే మాయ కాదు, శాస్త్రవేత్తలు సృష్టించిన మాయ. ఒక చిత్రమైన గాజు తొట్టెను శాస్త్రవేత్తలు తయారుచేశారు. ఈ గాజుతొట్టెలో చేపయినా, పిల్లి అయినా మరేదైనా పడినా ఇట్టే మాయమైపోతుందని చెబుతున్నారు.
చైనాలోని జెజియాంగ్, సింగపూర్‌లోని నన్యాంగ్ సాంకేతిక విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు ఒక గాజు తొట్టెను కనిపెట్టారు. ఈ గాజుతొట్టె ఆరు కోణాల చేపల అక్వేరియంలాగా ఉంటుంది. దానిపై నిటారుగా, పలు కోణాల్లో కాంతిని ప్రసరింపజేయడం ద్వారా తొట్టెలోని చేపలు, ఇతర జీవులు మనకు కనిపించవని దీన్ని తయారుచేసిన శాస్త్రవేత్తల బృందానికి నేతృత్వం వహించిన చెన్ హాంగ్ షెంగ్ చెబుతున్నారు. కావాలంటే వెళ్లి చూడవచ్చు మరి!