: బాపూ చరఖా వెల కోటి
మన జాతిపిత మహాత్మాగాంధీ ఉపయోగించిన వస్తువులను ఒక్కటొక్కటిగా వేలానికి తీసుకువస్తుంటే... ఆయన వస్తువులు ఎక్కువ ధరను వెచ్చించి అభిమానులు స్వంతం చేసుకుంటున్నారు. క్విట్ ఇండియా ఉద్యమకాలంలో గాంధీగారు ఉపయోగించిన చరఖాను లండన్‌లో మంగళవారం నాడు వేలానికి తెస్తే అది కోటి రూపాయల ధర పలికింది.
ఎనిమిది దశాబ్దాల క్రితం క్విట్ ఇండియా ఉద్యమకాలంలో పూణెలోని ఎరవాడ జైలులో శిక్షను అనుభవిస్తున్న సమయంలో గాంధీ ఈ చరఖాను ఉపయోగించారని ముల్లక్ వేలం సంస్థ అధికారి మైఖేల్ మోరిస్ తెలిపారు. భారతదేశంలో విద్య, పారిశ్రామికాభివృద్ధికి కృషి చేసిన అమెరికాకు చెందిన మెషినరీ రెవరెండ్ ఫ్లోయిడ్ ఏ పఫర్‌కు 1935లో గాంధీ ఈ చరఖాను బహుమతిగా ఇచ్చారు. తర్వాత కాలంలో ఇది చాలామంది చేతులు మారింది. గాంధీ చివరి విల్లు సైతం మంగళవారం నాడు జరిగిన వేలం పాటలో రూ.20,00,000 మొత్తానికి అమ్ముడుపోయింది.