: ఈడెన్ లో సచిన్ 199 వ టెస్టు రేపే


కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో రేపు సచిన్ కెరీర్లో 199 వ టెస్టు మ్యాచ్ ఆడనున్నాడు. భారత్-వెస్టిండీస్ మధ్య రెండు టెస్టుల సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. టెస్టుల్లో మంచి ఫాంలో ఉన్న టీమిండియాను ఎదుర్కొనేందుకు విండీస్ సర్వసన్నద్దంగా బరిలోకి దిగనుంది. రెండు టెస్టుల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి సచిన్ కు ఘనంగా వీడ్కోలు పలకాలని టీమిండియా ఆశిస్తోంది. దీంతో రెండు జట్ల మధ్య సమరం మరింత ఆసక్తిగా మారింది. టీమిండియా బ్యాటింగే ఆయుధంగా బరిలోకి దిగుతుండగా, విండీస్ పేస్ ఆయుధంగా బరిలోకి దిగుతోంది. సచిన్ కు అచ్చొచ్చిన ఈడెన్ లో సెంచరీ సాధించాలని బెంగాల్ అభిమానులు కోరుకుంటున్నారు. ఏది ఏమైనా రేపటి నుంచి ప్రారంభం కానున్న టెస్టుపై ప్రపంచ క్రికెట్ ప్రేమికులంతా ఆసక్తి చూపుతున్నారు.

  • Loading...

More Telugu News