: ఢిల్లీ బయల్దేరిన ఉప ముఖ్యమంత్రి
ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్శింహ ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. విభజన నేపధ్యంలో జీవోఎంకు 100 పేజీల నివేదిక ఇచ్చిన దామోదర అకస్మాత్తుగా ఢిల్లీ వెళ్లారు. అక్కడ పలువురు పార్టీ సీనియర్ నేతలతో భేటీ కానున్న డిప్యుటీ సీఎం సీమాంధ్రులు పంపిన 10 పేజీల నివేదికలోని అంశాలపై ఆరా తీయనున్నారు.