: ఐఐఎంబీ విద్యార్ధికి ముఖేష్ అంబానీ ఆఫర్
బెంగళూరులోని ఐఐఎంబీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్) విద్యార్ధులకు ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ గోల్డెన్ ఆఫర్ ఇస్తున్నారు. ఈ ఇనిస్టిట్యూట్ లో చివరి సంవత్సరం MBA చదువుతున్న విద్యార్ధుల నుంచి ఒకరిని ఎంపిక చేసుకుని, ఆ విద్యార్ధిని తన వ్యక్తిగత సహాయకుడిగా నియమించుకుంటారట.
ఇందుకు సంబంధించిన ప్రక్రియ మొదలైంది. చివరి సంవత్సరం విద్యార్ధులలో మొదటి 25 మంది విద్యార్ధులను ఇంటర్వ్యూ ద్వారా వడపోత పోసి, ఒకరిని ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్ధికి వార్షికవేతనం 20 నుంచి 25 లక్షల వరకు ఉంటుందని రిలయన్స్ సంస్థ చెబుతోంది.