: మెట్రో రైలు కూల్చేస్తామన్న కేసీఆర్ వ్యాఖ్యలు సరికాదు: లోక్ సత్తా అధ్యక్షుడు


తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటయ్యాక అవసరమైతే మెట్రో రైలును కూల్చేస్తామన్న కేసీఆర్ వ్యాఖ్యలను లోక్ సత్తా ఖండించింది. హైదరాబాద్ లో లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు కటారి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఇది నగర ప్రజలను మరింత ఇబ్బంది పెట్టే చర్యగా తాము భావిస్తున్నామని అన్నారు. నిర్మాణాలు చేయడమే తప్ప విధ్వంసాలు చేయడం రాజకీయ పార్టీల కర్తవ్యం కాదని ఆయన హితవు పలికారు. చారిత్రక కట్టడాల సుందరీకరణ సమస్యలు తలెత్తుతాయనే వాదనలపై గతంలోనూ చర్చలు జరిగాయని అన్నారు.

భూగర్భ నిర్మాణాలకు సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయన్న ఆయన, వ్యయం కూడా రెండున్నర రెట్లు పెరుగుతుందన్నది గుర్తు చేశారు. మెట్రోరైల్ వ్యవహారంలో సీఎంకు ముడుపులు ముట్టాయని అంటే వాటి వివరాలు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. మార్స్ మిషన్ ప్రాధమిక విజయం పట్ల ఇస్రో శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలిపారు.

  • Loading...

More Telugu News