: పెంచిన ఛార్జీలు ఉపసంహరించుకోవాలి: చంద్రబాబు
పెంచిన బస్సు ఛార్జీలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మాట్లాడుతూ ఆర్టీసీ ఇప్పటికే ఐదుసార్లు ఛార్జీలు పెంచి ప్రజలపై 3 వేల కోట్లు భారం వేసిందని అన్నారు. ఆర్టీసీ నష్టాల్లో ఉంటే ప్రత్యామ్నాయాలు చూసుకోవాలి తప్ప ప్రజలపై భారం మోపడం సమంజసం కాదని బాబు హితవు పలికారు.