: 'గబ్బర్ సింగ్' గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్ కు తీవ్ర అస్వస్థత


ప్రముఖ జానపద కళాకారుడు, గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. గతేడాది పవన్ కల్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్' చిత్రంలో ఆయన పాడిన 'గన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్లా..' పాటతో మరింత పాప్యులర్ అయ్యారు. ప్రస్తుతం కిమ్స్ ఆస్పత్రిలో ఇంటెన్సివ్ కేర్ లో చికిత్స పొందుతున్నారు. నిన్న సాయంత్రం ఆయన నివాసంలో కుప్పకూలి పడిపోవడంతో వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. అన్ని పరీక్షలు చేసిన వైద్యులు మొదట వడ్డేపల్లికి గుండె సమస్య ఉందని గుర్తించారు. అనంతరం కిడ్నీలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయనీ, కోమాలోకి వెళ్లే పరిస్థితి ఉందని, చికిత్స చేయాలని తెలిపారు. ఇందుకు కొన్ని లక్షల మొత్తంలో డబ్బు ఖర్చవుతుందని చెప్పారు. దాంతో, ఆయన చికిత్సకు సాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

  • Loading...

More Telugu News