: మేధావుల్ని సైతం ఆశ్చర్యపరుస్తున్న చిన్నారి
పిట్ట కొంచం కూత ఘనం ... అన్న సామెత ఊరికే పుట్టలేదనిపిస్తుంది, నేహారామూ అనే చిన్నారిని చూస్తే. పన్నెండేళ్ళ ఈ చిన్నపిల్ల మేథో ప్రజ్ఞ ఇప్పుడు ప్రపంచ మేధావుల్ని సైతం నివ్వెరపరుస్తోంది. ప్రఖ్యాత శాస్త్రవేత్తలు ఐన్ స్టీన్, స్టీఫెన్ హాకింగ్, బిల్ గేట్స్ వంటి మేధావుల కన్నా ఈ చిన్నారి ఐక్యూ చాలా ఎక్కువగా వుంది.
ఈ ప్రముఖుల ఐక్యూ 160 అయితే, నేహారాము ఐక్యూ 162. భారత సంతతికి చెందిన ఈ చిన్నారి తల్లిదండ్రులు మునిరాజు, జయశ్రీ ఇద్దరూ వైద్యులే. నేహాకు ఏడేళ్ళ వయసున్నప్పుడు ఈ దంపతులు భారత్ నుంచి బ్రిటన్ లోని కింగ్ స్టన్ కు వలస వెళ్ళారు. మనుషుల్లోని మేథో స్థాయి కొలవడానికి బ్రిటన్ లోని 'మేన్స' సంస్థ నిర్వహించే ఐఐఐబీ పరీక్షలో ఈ చిన్నారి 162 ఐక్యూ సాధించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.