: ఇరుప్రాంత నేతల నివేదికలనూ పంపించాం : బొత్స


జీవోఎంకు 11 అంశాలకు సంబంధించిన నివేదికలను సమర్పించామని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ తెలిపారు. నివేదికకు సంబంధించి ఇరుప్రాంత నేతల సలహాలు, అభిప్రాయాలు తీసుకున్నామని చెప్పారు. ఇది అత్యంత సున్నితమైన అంశమని అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు... విభజనకు అనుకూలంగా లేఖ ఇవ్వాలని తెలంగాణ ప్రాంత నేతలు కోరారని తెలిపారు. ఇరు ప్రాంత కాంగ్రెస్ నేతలు కూడా నివేదిక ఇచ్చారని... వాటన్నింటినీ హోంశాఖకు, జీవోఎంకు పంపించామని పీసీసీ అధ్యక్షుడు తెలిపారు. ఇంతకు ముందొక మాట, ఇప్పుడొక మాట, రేపొక మాట మేము చెప్పడం లేదని బొత్స తెలిపారు. కాంగ్రెస్ ఎప్పుడూ ఒకే మాట మీద నిలబడుతుందని చెప్పారు. సీడబ్ల్యూసీ నిర్ణయం కాంగ్రెస్ పార్టీకి శ్రీరామ రక్ష అని అన్నారు.

  • Loading...

More Telugu News