: బ్రదర్ అనిల్ పై హైకోర్టులో పిటిషన్
కరీంనగర్ లో నమోదైన ఓ కేసులో బ్రదర్ అనిల్ పేరు తొలగించడాన్ని ప్రశ్నిస్తూ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీనిని పరిశీలించిన కోర్టు బ్రదర్ అనిల్ కు వ్యక్తిగత నోటీసులు జారీ చేసింది. మరోవైపు అనిల్ పై నమోదైన కేసు వివరాలను తెలియజేయాలని పోలీసులకు కూడా నోటీసులు ఇచ్చింది. 2009 ఎన్నికల సమయంలో పాస్టర్ల సభ పేరిట హెలికాప్టర్ లో డబ్బు తరలించారని అనిల్ పై కేసు నమోదైంది.