: గర్వించదగ్గ విజయం: సోనియా గాంధీ
మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రయోగంలో పాలు పంచుకున్న శాస్త్రవేత్తలపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇస్రో శాస్త్రవేత్తలు ప్రతి భారతీయుడు గర్వించదగ్గ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారని ఏఐసీసీ చీఫ్ సోనియాగాంధీ కొనియాడారు. ఇందులో పాలు పంచుకున్న ప్రతి శాస్త్రవేత్తకు అభినందనలు తెలియజేస్తూ... ఇలాంటి ప్రయోగాలు మరిన్ని విజయవంతంగా పూర్తి చేసి, దేశప్రతిష్ఠలు ఇనుమడింప చేయాలని సోనియా కోరారు.