: రహదారుల దిగ్బంధానికి సహకరించండి: వైఎస్సార్సీపీ
సమైక్యాంధ్రకు మద్దతుగా రేపు, ఎల్లుండి తమ ప్రయాణాలు వాయిదా వేసుకుని... రహదారులను దిగ్బంధం చేసే కార్యక్రమానికి సహకరించాలని వైఎస్సార్సీపీ కోరింది. ఈ రోజు ఆ పార్టీ విడుదల చేసిన ప్రకటన మేరకు బుధ, గురు వారాల్లో సమైక్యాంధ్రకు మద్దతుగా రహదారుల దిగ్బంధానికి పిలుపునిస్తున్నామని తెలిపింది. ప్రణబ్ ను కలిసిన తాము రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరామని... ఇంత జరుగుతున్నా చంద్రబాబు నాయుడు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారని వైసీపీ నేతలు అన్నారు. సీమాంధ్రుల ఆత్మగౌరవ యాత్ర పేరిట చంద్రబాబు ఎవర్ని మోసం చేయాలనుకుంటున్నారో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. సోనియా స్క్రిప్టును సీఎం కిరణ్ చక్కగా అమలు చేస్తున్నారని విమర్శించారు.