: అగ్రరాజ్యాల సరసన భారత్
ఎంతో ప్రతిష్ఠాత్మకమైన మార్స్ ఆర్బిటర్ మిషన్ సక్సెస్ కావడంతో... భారత్ పేరు ప్రఖ్యాతులు ఇనుమడించాయి. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో మువ్వన్నెల పతాకం విజయ గర్వంతో రెపరెపలాడింది. ఈ ప్రయోగంతో భారత్ అగ్రరాజ్యాల సరసన చేరింది. ఇప్పటి వరకు ఈ ప్రయోగాన్ని ప్రపంచ వ్యాప్తంగా కేవలం మూడు దేశాలు... అమెరికా, రష్యా, యూరోపియన్ స్పేస్ ఏజన్సీలు మాత్రమే చేశాయి. ఇప్పుడు మనం ఈ స్థాయికి చేరిన నాలుగో దేశంగా చరిత్ర సృష్టించాం.