: మూడోసారి నాగా ముఖ్యమంత్రిగా రియో
నాగాలాండ్ లో వరుసగా మూడో సారి ఎన్పీఎఫ్ నేత నీఫియు రియో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కోహిమాలోని రాజ్ భవన్ లో సీఎం రియో మరో 11 మంది మంత్రులతో గవర్నర్ నిఖిల్ కుమార్ ఈరోజు ప్రమాణం చేయించారు. రియో నాగాలాండ్ కు 19వ ముఖ్యమంత్రి.
వాడివేడిగా సాగిన ఎన్నికల్లో ఎన్ఫీఎఫ్ 60 స్థానాలకు గాను 38 నెగ్గి స్పష్టమైన ఆధిక్యంతో అధికారాన్ని నిలుపుకుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ ఎన్నికల వేళ కోటి రూపాయల నగదుతో దొరికిపోయిన హోం మంత్రి ఇంకాగ్ ఇంచెన్ మంత్రి వర్గంలో తన స్థానం నిలుపుకున్నాడు.