: అతివేగంగా కల్వర్టును ఢీ కొనడం వల్లే వోల్వో బస్సు ప్రమాదం: క్లూస్ టీం


మహబూబ్ నగర్ జిల్లా పాలెం బస్సు ప్రమాదంపై క్లూస్ టీం దర్యాప్తు పూర్తైంది. దర్యాప్తు నివేదికను కొద్దిసేపటి కిందట క్లూస్ టీం జిల్లా ఎస్పీకి అందజేసింది. అతివేగంగా బస్సు కల్వర్టును ఢీ కొనడం వల్లే వోల్వో బస్సు ప్రమాదం జరిగిందని తేల్చారు. కల్వర్టు వైపు డీజిల్ ట్యాంక్ చొచ్చుకుపోవడంతో వెంటనే మంటలు వ్యాపించాయని పేర్కొంది. మొదట బస్సు కింది లగేజీ భాగం తగలబడంవల్ల ప్రమాద తీవ్రతను ప్రయాణికులు అంచనా వేయలేకపోయారని నివేదికలో వివరించింది. ఈ సమయంలో బస్సు ఆటోమేటిక్ లాక్ సిస్టమ్ పూర్తిగా పనిచేయకుండా పోయిందని, బస్సులో ఎలాంటి పేలుడు పదార్ధాలు, రసాయనాలు లేవు అని చెప్పింది.

  • Loading...

More Telugu News