: బాబు ఒత్తిళ్లకు లొంగరు: ఎర్రబెల్లి
టీడీపీ అధినేత ఎలాంటి ఒత్తిళ్లకు లొంగరని ఆ పార్టీ నేత ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ సీమాంధ్ర నేతలు చంద్రబాబుపై తీవ్ర ఒత్తిడి తీసుకు వస్తున్నారని, అయినా ఆయన ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గరని తాను ఆశిస్తున్నానని అన్నారు. తెలంగాణ నేతలు విభజనపై ప్రధానికి లేఖ రాయాలని, సీమాంధ్ర నేతలు అఖిలపక్షానికి వెళ్లాల్సిన అవసరం లేదని బాబుపై ఒత్తిడి తెస్తున్నారు.