: భద్రాద్రి రాముని కళ్యాణానికి ఏర్పాట్లు షురూ
ఏప్రిల్ 19న శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో వివిధ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ నేడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. వీఐపీ దర్శనాల విధివిధానాలను నేడు ప్రకటించారు. కళ్యాణోత్సవ వేళ స్వామివారిని వీఐపీలు దర్శించుకునేందుకు గంటన్నర కేటాయించనున్నారు. కాగా, ఈ కళ్యాణోత్సవానికి ఆర్టీసీ 400 ప్రత్యేక బస్సులు నడపనుంది.