: సీమాంధ్ర నేతల వ్యాఖ్యలపై టీ టీడీపీ ఎందుకు స్పందించడం లేదు?: ఎంపీ పొన్నం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అప్రజాస్వామికంగా జరుగుతోందన్న సీమాంధ్ర తెలుగుదేశం నేతల వ్యాఖ్యలపై టీ టీడీపీ నాయకులు ఎందుకు స్పందించడం లేదని కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. వారు చేస్తున్న వ్యాఖ్యలను ఖండించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ టీడీపీ నేతలు పార్టీ అధినేత చంద్రబాబుకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.