: 'మిస్ ఏషియా పసిఫిక్' కిరీటాన్ని సీజ్ చేసిన ఎయిర్ ఇంటెలిజెన్స్


తాజాగా కొరియాలో జరిగిన పోటీల్లో 'మిస్ ఏషియా పసిఫిక్-2013' కిరీటాన్ని భారత్ కు చెందిన సృష్టి రాణా గెల్చుకున్న సంగతి తెలిసిందే. అయితే, సియోల్ నుంచి సృష్టి తిరిగి వస్తుండగా... ఆమె కిరీటాన్ని ఈ రోజు ఉదయం ముంబై ఎయిర్ పోర్టులో 'ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్' స్వాధీనం చేసుకుంది. విలువైన వజ్రాలు పొదిగిన ఈ కిరీటం గురించి ముందుగా అధికారులకు తెలపకపోవడంతో సీజ్ చేసినట్లు తెలుస్తోంది. వజ్రాలకు సంబంధించిన ట్యాక్స్ లు చెల్లించిన తర్వాత కిరీటాన్ని తిరిగి అప్పగిస్తామని ఒక అధికారి తెలిపారు. మిస్ ఏషియా పసిఫిక్ గా ఉన్నన్ని రోజులు కాంట్రాక్టు ప్రకారం ఆ కిరీటం సృష్టి వద్దే ఉంటుంది. కాంట్రాక్టు ముగిశాక తిరిగి అప్పగించాలి.

  • Loading...

More Telugu News