: విజయవాడ రైల్వే యార్డులో మహిళపై సామూహిక అత్యాచారం


అత్యాచారాలకు అంతే లేకుండా పోతోంది. కాపాడాల్సిన వారే కాటేస్తున్నారు. నిన్న హైదరాబాద్ లో ఓ యువతిపై ముగ్గురు ఆర్మీ జవాన్లు అత్యాచారానికి తెగబడ్డారన్న చేదు నిజం మరువక ముందే, విజయవాడలో మరో అత్యాచారం జరిగింది. ఇక్కడ కూడా రక్షక భటుడే దారుణానికి ఒడిగట్టడం ఆందోళనకు గురి చేస్తున్న అంశం. విజయవాడ రైల్వే యార్డులో ఒక మహిళపై రైల్వే ప్రోటెక్షన్ పోలీస్ ఫోర్స్ కు చెందిన కానిస్టేబుల్ మరో వ్యక్తితో కలసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలి బంధువులు వారిద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News