: చర్లపల్లి జైలుపై దృష్టి సారించిన ఎన్ఐఏ


హైదరాబాద్ జంట పేలుళ్ల దర్యాప్తులో ఎన్ఐఏ అధికారులు ఏ ఒక్క కోణాన్ని వదలడంలేదు. తాజాగా చర్లపల్లి జైలులో రోజువారీ కార్యకలాపాలపై కన్నేశారు. ఈ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఉగ్రవాదులను ఎవరెవరు ములాఖాత్ లో కలిశారని ఆరా తీశారు. చర్లపల్లి అధికారుల నుంచి కొంత సమాచారం సేకరించారు. దీంతో, కేసు దర్యాప్తులో కొంతమేర అయినా పురోగతి కనిపించే అవకాశం ఉందని ఎన్ఐఏ భావిస్తోంది. 

  • Loading...

More Telugu News