: మతసామరస్యం కాపాడటంలో ఐపీఎస్ లదే కీలకపాత్ర : రాష్ట్రపతి ప్రణబ్
సివిల్ సర్వెంట్స్ నిష్పక్షపాతంగా పని చేయాలని... వృత్తి పట్ల నిబద్ధత, అంకితభావం కనబరచాలని రాష్ట్రపతి అన్నారు. మత సామరస్యం కాపాడటంలో ఐపీఎస్ లది కీలకపాత్ర అని చెప్పారు. నేషనల్ పోలీస్ అకాడెమీలో ఐపీఎస్ అధికారుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి హాజరైన ప్రణబ్... ప్రొబేషనరీ ఐపీఎస్ లను ఉద్దేశించి ప్రసంగించారు.
మహిళలు, చిన్నారులపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి కఠిన చట్టాలను తీసుకువచ్చామని రాష్ట్రపతి తెలిపారు. జస్టిస్ వర్మ కమిటీ సిఫార్సులు పోలీసు వ్యవస్థకు ఎంతో ఉపయోగపడతాయని ప్రణబ్ అన్నారు. దేశంలో జరుగుతున్న సంఘ విద్రోహ శక్తులను అణచివేయడానికి నిరంతరం కృషి చేయాలని ఐపీఎస్ లకు సూచించారు. తీవ్రవాదులకు భారత్ లక్ష్యంగా మారుతోందని చెప్పారు. తీవ్రవాదులు, చొరబాటుదారులపై భారత్ ఉక్కుపాదం మోపుతోందని అన్నారు. వల్లభాయ్ పటేల్ దేశానికి ఎన్నో సేవలందించారని ఆయన గుర్తుచేశారు.