: వ్యవసాయ రంగంలోకి యువత రావాలి : సీఎం కిరణ్


అకాల వర్షాలు, ప్రకృతి విపత్తులు రైతును నష్టాల పాలు చేస్తున్నాయని సీఎం కిరణ్ అన్నారు. ఎరువులు, విత్తనాల ధరలు పెరగడంతో రైతుకు పెట్టుబడులు కూడా పెరిగాయని తెలిపారు. రైతుకు పెట్టుబడి రాయితీలు ఇస్తున్నా అవి సరిపోవడం లేదని కిరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. మాదాపూర్ లోని హెచ్ ఐసీసీ లో జరుగుతున్న అంతర్జాతీయ వ్యవసాయ సదస్సుకు హజరైన సీఎం... జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు. వ్యవసాయరంగంలో కమతాల పరిమాణం తగ్గిపోవడం ఆందోళనకర అంశమని ఆయన అన్నారు.

ఎంతో కీలకమైన వ్యవసాయ రంగంలోకి యువత రావడం లేదని... ఇది దేశ భవిష్యత్తుకు మంచిది కాదని సీఎం అన్నారు. రైతు రుణాల కోసం బ్యాంకుల మీద ప్రభుత్వాలు ఒత్తిడి తెస్తున్నాయని చెప్పారు. అంతే కాకుండా, పంటల భీమా విధానంలో కూడా ఎన్నో మార్పులు రావాల్సిన అవసరముందని సీఎం తెలిపారు. దీనికితోడు, విద్యావ్యవస్థలోనూ వ్యవసాయానికి సంబంధించిన పాఠ్యాంశాలు ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News