: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీ టీడీపీ నేతల భేటీ
తెలంగాణ టీడీపీ నేతలు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో భేటీ అయ్యారు. త్వరలో జరగనున్న అఖిలపక్ష భేటీ, విభజనపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. కాగా, సమన్యాయం చేయాలంటున్న పార్టీ అధినేత చంద్రబాబు మాటల నేపథ్యంలో, తెలంగాణలోనూ పార్టీకి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు... తెలంగాణపై ప్రధాని మన్మోహన్ సింగ్ కు లేఖ రాయించాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో, లేఖ రాయించకూడదని అటు సీమాంధ్ర నేతలు యత్నిస్తున్నారు.