: ఇండియన్ డయాస్పోరా వేదికపై ప్రసంగించనున్న మోడీ


ఇటీవలే వార్టన్ ఆర్థిక సదస్సులో ప్రసంగించే అవకాశం కోల్పోయిన గుజరాత్ సీఎం నరేంద్ర మోడీకి మరో అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. కొందరు ఇండో-అమెరికన్ ప్రొఫెసర్ల ఒత్తిడి కారణంగా వార్టన్ వేదికపై మోడీ ప్రసంగం రద్దయిన సంగతి తెలిసిందే.

కాగా, అమెరికాలోని పలు రాష్ట్రాల్లో నిర్వహించే ఇండియన్ డయాస్పోరా సదస్సులో..  మోడీ గుజరాత్ లోని కర్ణావతి నుంచి టెలి కాన్ఫరెన్ప్ ద్వారా ప్రసంగిస్తారని తెలుస్తోంది. మార్చి 9న ఈ కార్యక్రమం ఉంటుందని అమెరికాలోని బీజేపీ అనుకూల పోర్టల్ ఒకటి వెల్లడించింది. 

  • Loading...

More Telugu News