: వృద్ధ దంపతులను కొట్టి చంపిన గ్రామస్తులు
ఒక వైపు అంగారక గ్రహ యాత్రకు బయలుదేరుతూ... సైన్స్, టెక్నాలజీ పరంగా మనమెంతో ఎదిగామని ప్రపంచానికి చూపెడుతున్నాం. మరో వైపు మూఢ నమ్మకాలను గుడ్డిగా నమ్ముతూ, భయంతో పక్కనున్న వాడిని కిరాతకంగా హతం చేసేస్తున్నాం. ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో వృద్ధ దంపతులపై గ్రామస్తులు దాడి చేసి, కొట్టి చంపారు. ఈ దారుణ ఘటన నల్గొండ జిల్లా కేశరాజుపల్లిలో చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేశారు.