: నేడు జీవోఎంకు నివేదిక సమర్పించనున్న కాంగ్రెస్
కేంద్ర మంత్రుల బృందానికి నేడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నివేదిక సమర్పించనుంది. నిన్న సీమాంధ్ర, తెలంగాణ నేతలతో భేటీ అయిన పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ... వారి అభిప్రాయాలను తెలుసుకున్న సంగతి తెలిసిందే. వారు చెప్పిన అభిప్రాయాలను బొత్స తన నివేదికలో పొందుపరచనున్నారు. విధివిధానాలకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ నేతలు నేడు మరోసారి భేటీ కానున్నారు.