: చక్కటి డ్రైవింగ్ కోసం కూడా ఒక యాప్ ఉంది
రోడ్డుపై చక్కగా డ్రైవింగ్ చేయాలంటే డ్రైవింగ్‌పై మంచి పట్టు ఉండాలి, వెళ్లే దారి గురించి చక్కటి అవగాహన ఉండాలి. అయితే జోరువాన పడుతున్న సమయంలోనో, లేదా దట్టమైన పొగమంచు కమ్మేసిన సమయంలోనో వెళ్లాల్సి వస్తే... అలాంటి సమయాల్లో ముందుగా వెళుతున్న వాహనాలు మనకు కనిపించవు. దీంతో డ్రైవింగ్ కష్టమవుతుంది. ఇలాంటి వారికోసం ఒక కొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది. మీకు స్మార్ట్ ఫోన్ గనుక ఉంటే ఇలాంటి సమస్యలను తేలిగ్గా పరిష్కరించుకోవచ్చు అంటున్నారు పరిశోధకులు.
స్మార్ట్ డ్రైవింగ్‌కోసం రూపొందించిన హడ్‌వే యాప్ వాహనాలు నడిపేవారికి చక్కగా ఉపయోగపడుతుందని దీని రూపకర్తలు చెబుతున్నారు. ఈ యాప్ సాయంతో రోడ్డుపై ఎక్కడ మలుపులున్నాయి, మలుపు ఎంత దూరంలో ఉంది? అనే విషయం కారు ముందు అద్దంమీద కనిపిస్తుందని, ప్రస్తుతం ఉన్న నావిగేషన్ సిస్టమ్ డ్రైవర్ ఏకాగ్రతను భంగం చేసే విధంగా ఉందని దాన్ని సరిచేస్తూ ఈ హడ్‌వే యాప్‌ను తయారుచేసినట్టు దీని తయారీదారులు చెబుతున్నారు. ఒకసారి రోడ్డుకు సంబంధించిన వివరాలు ఈ యాప్‌లో ఫీడ్ అయిన తర్వాత ఇంటర్నెట్ అవసరం కూడా ఉండదని, ఎంచక్కా రోడ్డుపై దూసుకువెళ్లవచ్చని చెబుతున్నారు.