: మెమరీని పెంచుకోవాలంటే...


మీ మెమరీ పవర్‌ను పెంచుకోవాలనుకుంటున్నారా... అయితే చక్కగా ఏరోబిక్స్‌ చేయడం మొదలుపెట్టండి. అదేంటి శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం కోసం చేసే ఏరోబిక్స్‌ మెమరీని ఎలా మెరుగు పరుస్తుంది అనుకుంటున్నారా... దీనిపై ప్రత్యేక అధ్యయనం చేసిన పరిశోధకులు ఏరోబిక్స్‌ కేవలం ఫిట్‌నెస్‌ కోసమే కాదు, మన మెమరీని పెంచుకోవడానికి కూడా తోడ్పడతాయని చెబుతున్నారు.

జ్ఞాపకశక్తి విషయంలో ముఖ్యంగా మల్టిపుల్‌ స్ల్కెరోసిస్‌ (ఎంఎస్‌)తో బాధపడేవారికి ఏరోబిక్స్‌ చేయడం వల్ల జ్ఞాపకశక్తి దాదాపుగా 54 శాతం పెరుగుతుందని కెస్లర్‌ ఫౌండేషన్‌కు చెందిన పరిశోధకులు చెబుతున్నారు. ఎంఎస్‌తో బాధపడేవారి జ్ఞాపకశక్తిని పెంచడానికి ఎలాంటి మందులుకానీ, బిహేవియరల్‌ చికిత్సకానీ పనిచేయదని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన లీవిట్‌ చెబుతున్నారు. ఇలాంటి రోగులకు కేవలం ఏరోబిక్స్‌ మాత్రమే చక్కగా ఉపయోగపడతాయని తమ పరిశోధనల్లో తేలిందని, వారానికి మూడు రోజుల చొప్పున మూడు నెలలపాటు ఏరోబిక్స్‌ చేసిన ఎంఎస్‌ రోగులను పరిశీలించినప్పుడు వారి జ్ఞాపకశక్తి 53.5 శాతం పెరిగిందని లీవిట్‌ తెలిపారు. అదే ఏరోబిక్స్‌ చేయని వారిలో జ్ఞాపకశక్తిలో ఎలాంటి మార్పులు లేవని చెబుతున్నారు. కాబట్టి ఏరోబిక్స్‌ ద్వారా కేవలం శరీరం ఫిట్‌గా ఉండడమేకాదు... మన మెమరీ కూడా మెరుగవుతుంది.

  • Loading...

More Telugu News