: మీ పిల్లల ఊబకాయం తగ్గాలంటే...


మీ పిల్లలు ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నారా... అయితే చక్కగా వారిని త్వరగా నిద్రపోయేలా చేయండి. దీనివల్ల వారి ఊబకాయం తగ్గుతుందంటున్నారు పరిశోధకులు. ఊబకాయం అనేది నేడు అందరినీ వేధిస్తున్న సమస్య. దీనికి ఇప్పుడు చిన్న పిల్లలు కూడా గురవుతున్నారు. చిన్నారుల్లో ఊబకాయం సమస్యను తగ్గించడానికి వారిని త్వరగా నిద్రపుచ్చితే మంచి ఫలితం కనిపిస్తుందని శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో తేలింది.

చిన్నారుల్లో ఆహారపు అలవాట్లపై వారి నిద్ర వేళల ప్రభావం అధికంగా ఉంటుందని, తక్కువ సమయం నిద్రపోయేవారు ఎక్కువ ఆహారం తీసుకుంటారని వీరి పరిశోధనలో తేలింది. శాస్త్రవేత్తలు తమ అధ్యయనానికి 8 నుండి 11 సంవత్సరాల వయసున్న పిల్లలను ఎంపిక చేసుకున్నారు. వీరిలో ఎక్కువ బరువు ఉన్నవారు కూడా ఉన్నారు. వీరిని మొదట వారం రోజుల పాటు వారు ఎలాంటి సమయాల్లో నిద్రపోతారో అదే వేళలను పాటించేలా చేశారు. తర్వాత రెండవ వారంలో వారి నిద్ర వేళలను పెంచారు. నిద్రపోయే సమయం పెరగడం వల్ల వారు ఆహారం స్వీకరించే తీరులో కూడా తేడా కనిపించింది. ఆకలికి కారణమయ్యే లెప్టిన్‌ స్థాయులు కూడా వారిలో తగ్గినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. కాబట్టి పిల్లల్లో ఊబకాయం సమస్యను తగ్గించడానికి చక్కగా వారిని త్వరగా నిద్రపుచ్చండి.

  • Loading...

More Telugu News