: రాత్రి 9 గంటలకు రాష్ట్రపతితో జగన్ భేటీ


రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాత్రి 9 గంటలకు భేటీ కానున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి జగన్ కు అపాయింట్ మెంట్ ఇచ్చారు. సాయంత్రం 7:35 నిమిషాలకు రాజ్ భవన్ కు రాష్ట్రపతి చేరుకుంటారు. రాష్ట్రంలో ఇటీవల సంభవించిన ఫైలిన్ తుపాను, తరువాత వచ్చిన అల్పపీడనం ధాటికి కోస్తాంధ్ర, తెలంగాణ లోని కొన్ని ప్రాంతాల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ సందర్భంగా దీనిపై కేంద్ర ప్రభుత్వం సాయం అందజేయాలని ఆ పార్టీ సీనియర్ నేతలతో కలిసి రాష్ట్రపతిని జగన్ కోరనున్నారు.

  • Loading...

More Telugu News