: కంటతడి పెట్టిన కాశ్మీర్ ముఖ్యమంత్రి


పోలీసు కాల్పుల్లో ఓ యువకుడు మృతి చెందడంతో కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చలించిపోయారు. అఫ్జల్ గురు ఉరితీతకు నిరసనగా కొందరు పోలీసులపై రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు కాల్పులకు దిగడంతో ఓ యువకుడు మరణించాడు.

ఇదే విషయమై శాసనసభలో మాట్లాడుతుండగా ఒమర్ అబ్దుల్లా కంట నీరు పెట్టారు. రాళ్లు విసిరినంతనే కాల్పులు జరపాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. కాగా, ఈ వ్యవహారంలో కాశ్మీర్ శాసన సభను ప్రతిపక్షాలు స్థంభింపజేశాయి.

  • Loading...

More Telugu News