: అమెరికా వల్ల పాక్ నాయకత్వం టార్గెటైందట!
అమెరికాను పాకిస్థాన్ అధికార పార్టీ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) నేతలు తప్పుపడుతున్నారు. అమెరికా తీరువల్ల తాము భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోందంటూ మండిపడుతున్నారు. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లోని నార్త్ వజీరిస్తాన్ లో తెహ్రికే తాలిబాన్ నేత హకీముల్లా మసూద్ ను ద్రోణ్ క్షిపణులతో అమెరికా మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. అమెరికాకు మద్దతిస్తున్న పాక్ నాయకత్వంపైనా, అమెరికాపైనా ప్రతీకారం తీర్చుకుంటామని తాలిబాన్ ప్రకటించింది. దీంతో అగ్రరాజ్యం చేసిన పనివల్ల చర్చలకు సిద్ధమని ప్రకటించిన పాక్ తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని పేరు చెప్పడానికి ఇష్టపడని నేత తెలిపారు. శాంతి నెలకొనాలంటూ పాక్ చేస్తున్న ప్రయత్నాలకు మసూద్ మరణం అడ్డుకట్టవేయనుందని అభిప్రాయపడ్డారు. తాలిబాన్ కు హకీముల్లా మృతి తీరని లోటని, అందువల్ల తాలిబాన్లు ఏ రీతిన విరుచుకుపడతారో తెలియదని పాక్ నాయకత్వం భయపడుతోంది.