: జగన్ కేసులో రూ. 35 కోట్ల అటాచ్ మెంట్ సరైందే : ఈడీ న్యాయప్రాధికార సంస్థ
జగన్ అక్రమాస్తుల కేసులో... జగతి పబ్లికేషన్స్ లో పెట్టుబడులపై ఈడీ న్యాయప్రాధికార సంస్థ మరో తీర్పు వెలువరించింది. రూ.34.65 కోట్ల పెట్టుబడులను ఈడీ అటాచ్ చేయడం సరైన చర్యేనని అడ్జుడికేటింగ్ అథారిటీ అభిప్రాయపడింది. ఇవన్నీ నేరపూరితమైన ఆస్తులని ధృవీకరించింది. ముగ్గురు పారిశ్రామికవేత్తలను బెదిరించి పెట్టుబడులు సేకరించారని తేల్చిచెప్పింది.