: చంద్రబాబును చొక్కా పట్టుకుని నిలదీయండి : పయ్యావులకు రోజా సలహా
టీడీపీ నేత పయ్యావుల కేశవ్ కు వైఎస్సార్ సీపీ నేత, సినీ నటి రోజా ఓ సలహా ఇచ్చారు. విభజనకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం కాదు... చంద్రబాబు నాయుడి చొక్కా పట్టుకుని నిలదీయాలని సూచించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స, టీడీపీ అధినేత చంద్రబాబు, కేంద్ర మంత్రులు ఎందుకు లేఖలు ఇవ్వడం లేదని రోజా ప్రశ్నించారు. తెలుగువారికి వెన్నుపోటు పొడిచే విషయంలో చంద్రబాబు అన్నగా, కిరణ్ తమ్ముడిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సోనియా ఆదేశాల కోసం టీడీపీ ఎదురు చూస్తోందని రోజా మండిపడ్డారు. ఇప్పటికైనా కాంగ్రెస్, టీడీపీలు సమైక్య నినాదంతో ప్రజల ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు.