: సినిమాటోగ్రఫీ చట్టంలో మార్పుకు కమిటీ వేసిన కేంద్రం


'విశ్వరూపం' సినిమా విడుదలకు ఎదుర్కొన్న అడ్డంకులపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సెన్సార్ బోర్డు అనుమతించిన తర్వాత కూడా 95 కోట్ల ఈ భారీ బడ్జెట్ సినిమాని తమిళనాడు ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో చిత్ర నిర్మాత కమల్ హాసన్ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి మరో చిత్రానికి రాకుండా కేంద్రప్రభుత్వం, సినిమాటోగ్రఫీ చట్టంపై మార్పులు తెచ్చేందుకు కమిటీ వేసినట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి మనీష్ తివారీ తెలిపారు. 

ఎనిమిది మందితో కూడిన ఈ కమిటీకి రిటైర్డు ఢిల్లీ ప్రధాన న్యాయమూర్తి ముఖుల్ ముద్గల్, మాజీ కేంద్ర సెన్సార్ బోర్డు అధ్యక్షురాలు షర్మిలా ఠాగూర్, ప్రముఖ పాటల రచయిత, లోక్ సభ సభ్యుడు జావెద్ అక్తర్ నేతృత్వం వహించనున్నారు.

  • Loading...

More Telugu News