: డీఎస్ నివాసం ముట్టడి
తెలంగాణ కోసం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని కోరుతూ పీడీయస్యూ విద్యార్థులు నిజామాబాద్ లో కాంగ్రెస్ నేత డీ శ్రీనివాస్ నివాసాన్ని ముట్టడించారు. తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుంటే డీఎస్ ఎందుకు నోరు మెదపటం లేదని వారు ప్రశ్నించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.