: టీ టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ
తెలంగాణ టీడీపీ నేతలతో పార్టీ అధినేత చంద్రబాబు తన నివాసంలో భేటీ అయ్యారు. విభజనపై కేంద్ర మంత్రుల బృందానికి పంపాల్సిన నివేదికతో పాటు అఖిలపక్ష భేటీకి వెళ్లాలా? వద్దా? అనే అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ రోజు ఉదయం సీమాంధ్ర తేదేపా నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఇప్పుడు తెలంగాణ నేతలతో సమావేశం ముగిసిన తర్వాత చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోనున్నారు.