: నిజమే... మోడీ ప్రభావం కన్పిస్తోంది: ఒమర్ అబ్దుల్లా
దేశవ్యాప్తంగా మోడీ పవనాలు వీస్తున్నాయన్నది కాస్త అతిశయోక్తే అయినా.. ఎంతో కొంత నిజమేనని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అంటున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి అయిన మోడీ ప్రభావం కాదనలేనిదని, ఎలక్షన్లలో మోడీ ప్రభావం ఉండదనడం సరికాదన్నారు. మోడీ పవనం ఎంతో కొంత ఉన్నదని అంగీకరించారు. అయితే, సామాన్య ఓటరుపై అంతగా మోడీ ప్రభావం లేదని, కానీ బీజేపీ కేడర్ పై మాత్రం బాగా ఉందన్నారు. ఇది ఎన్నికల్లో చూపిస్తుందని, మనం వేచి చూడాలన్నారు. మోడీ రాకతో బీజేపీకి సానుకూలత పెరిగిందని, ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉందని ఒమర్ మాటల్లో అంతరార్థంగా కన్పిస్తోంది.