: కోహ్లీ ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్ మన్


భారత యువ కెరటం విరాట్ కోహ్లీ వన్డేల్లో ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్ మన్ గా అవతరించాడు. ఆసీస్ తో జరిగిన తాజా సిరీస్ లో చెలరేగి ఆడి తక్కువ బంతుల్లోనే సెంచరీ సాధించిన కోహ్లీ... ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో రెండు స్థానాలు మెరుగు పరుచుకుని అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. తన పుట్టిన రోజుకు సరిగ్గా రెండు రోజుల ముందు కోహ్లీ ఈ ఘనతను సాధించాడు. కాగా ఇప్పటి వరకు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానం చేజిక్కించుకున్న 3వ భారత బ్యాట్స్ మన్ కోహ్లీ కావడం విశేషం. గతంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్, కెప్టెన్ కూల్ ధోనీలు ఈ ఘనతను సాధించారు. కోహ్లీతో పాటు ధావన్, రోహిత్ శర్మలు కూడా తమ ర్యాంకులను మెరుగు పరుచుకుని టాప్ 20లో చోటు సంపాదించారు. ధావన్ ఐదు స్థానాలు మెరుగు పరుచుకుని 11వ ర్యాంకు సాధించగా, రోహిత్ శర్మ 15వ ర్యాంకుకు చేరుకున్నాడు. టాప్ 20లో ముందునుంచీ కొనసాగుతున్న ధోనీ(6), రైనా (19) పాత ర్యాంకుల్లోనే కొనసాగుతున్నారు.

  • Loading...

More Telugu News