: సీఎం కిరణ్ పై శంకర్రావు పిటిషన్ కొట్టివేత
ఎర్రచందనం టెండర్ల వ్యవహారంలో సీఏం కిరణ్ కుమార్ రెడ్డి ప్రతివాదిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావు వేసిన పిటిషన్ ను హైకోర్టు నేడు కొట్టివేసింది. ప్రభుత్వం ఎర్ర చందనాన్ని స్వల్ప మొత్తానికే చవకగా అప్పగించిందని ఆరోపించిన శంకర్రావు ఈ ఉదంతంలో సీబీఐ విచారణ జరిపించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. పైగా, కొన్ని ఆధారాలతో అనుబంధ అఫిడవిట్ దాఖలు చేసినా శంకర్రావుకు హైకోర్టులో నిరాశ తప్పలేదు.