: ఢిల్లీ విమానాశ్రయంలో రూ. 74 లక్షల బంగారం పట్టివేత


74 లక్షల రూపాయల బంగారు బిస్కెట్లను దేశంలోకి అక్రమంగా స్మగ్లింగ్ చేస్తూ ఇద్దరు ప్రయాణికులు ఢిల్లీ విమానాశ్రయంలో దొరికిపోయారు. వీరిలో ఒకరు రియాద్ నుంచి, మరొకరు సింగపూర్ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి దొంగ బంగారంతో బయటపడాలని చూశారు గానీ సఫలం కాలేదు. వారి వస్త్రాలలో దాగి ఉన్న 2.6కేజీల బరువుగల బంగారు బిస్కెట్లను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరినీ అరెస్ట్ చేశారు. వీటి విలువ 74 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. కేంద్ర ప్రభుత్వం బంగారం విషయంలో చాలా కఠినంగా వ్యహరిస్తోంది. కేంద్రం ఆదేశాల మేరకే కస్టమ్స్ అధికారులు విమానాశ్రయాలలో ఇటీవల క్షుణంగా తనిఖీలు చేస్తున్నారు. దీంతో వరుసగా దొంగ బంగారం వెలుగుచూస్తోంది.

  • Loading...

More Telugu News