: బొత్సతో ముగిసిన టీ నేతల భేటీ
పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణతో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ ముగిసింది. పార్టీ నుంచి ఒకే నివేదిక ఇవ్వాలని టి.నేతలు ఈ సమావేశంలో బొత్సను కోరారు. దాంతో, కేంద్రం కోరిన 11 అంశాలపై తమ అభిప్రాయాలు వెల్లడిస్తూ నివేదిక సిద్ధం చేయాలని తెలంగాణ నేతలకు బొత్స సూచించారు. ఈ నేపథ్యంలో, జీవోఎంకు పంపాల్సిన నివేదికపై తెలంగాణ నేతలు తమ అభిప్రాయాలను సిద్ధం చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టనున్నారు. భేటీ అనంతరం బొత్స మాట్లాడుతూ... సీఎం, సీమాంధ్ర నేతలతో సమావేశమైన తర్వాత పూర్తి వివరాలు చెబుతానన్నారు. అయితే, రెండు ప్రాంతాల నేతల అభిప్రాయాలను తాను గౌరవిస్తానని బొత్స చెప్పారు.