: కొత్త పార్టీలు మనుగడ సాగించలేవు : మంత్రి డొక్కా


ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో వచ్చిన ఏ కొత్త పార్టీ కూడా మనుగడ సాగించలేదని మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర రాజకీయాల్లో శూన్యత లేదని అన్నారు. విభజన, సమైక్యత అనే అంశాలపై తమ అభిప్రాయాలను జీఎంవో ఎదుట పార్టీలన్నీ స్పష్టంగా చెప్పాలని ఆయన సూచించారు. అభిప్రాయాలు చెప్పమని అనడం... ఏదైనా ఒక కేసు సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు, జిల్లా కోర్టులో వాదించడం లాంటిదని అభిప్రాయపడ్డారు. తాను కాంగ్రెస్ వాదినని, ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని మంత్రి డొక్కా తెలిపారు.

  • Loading...

More Telugu News