: ఎంపీపై కేసును వెనక్కి తీసుకున్న నటి శ్వేతామీనన్
కాంగ్రెస్ ఎంపీ పీతాంబర కురుప్ పై లైంగిక వేధింపుల కేసును మలయాళ నటి శ్వేతా మీనన్ ఉపసంహరించుకుంది. కేరళలోని కొల్లాంలో పడవపోటీల సందర్భంగా ఎంపీ తన పట్ల అసభ్యకరంగా వ్యవహరించారంటూ శ్వేత శనివారం రాత్రి ఫిర్యాదు చేశారు. అయితే, తాను అలా వ్యవహరించేవాడిని కాదని, ఒకవేళ తప్పు జరిగి ఉంటే క్షమించాలంటూ 71 ఏళ్ల పీతాంబర కోరడంతో.. శ్వేతా మీనన్ మనసు మార్చుకుంది. చిత్ర పరిశ్రమ పెద్దల సూచన మేరకు కేసును ఉపసంహరించుకుంటున్నట్లు ఆమె ప్రకటించింది. కేసును ఉపసంహరించుకుంటున్నట్లు శ్వేత నిన్న రాత్రి మెయిల్ పంపారని కొల్లాం పోలీసులు ఈ రోజు మీడియాకు తెలిపారు.